జాగ్రత్త… ప్రచారంలో…

– వ్యక్తిగత దూషణలు విమర్శలు నేరమే…
నవ తెలంగాణ- సిరిసిల్ల:
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది ఎన్నికల వేడి రాజుకుంది పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నవారు ప్రచార పర్వానికి సిద్ధమయ్యారు కొన్ని నియోజకవర్గాల్లోని కొందరు అభ్యర్థులు లక్ష్మణ రేఖ దాటుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల అభ్యర్థుల వాగ్వివాదం తీవ్ర చర్చగా మారింది తాము గెలిస్తే ప్రజలకు సమాజానికి ఎటువంటి ఉపయోగకర పనులు చేస్తామో చెప్పుకోవాలి ఇలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం కులమతపరమైన ఉద్రేకాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం నిషేధం అభ్యర్థులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు దీనికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చారు
 హద్దులు దాటితే ఇక అంతే…
– ఇప్పటికే ఉన్న విభేదాలను మరింత రెచ్చగొట్టేలా పరస్పర దేశాన్ని పెంచేలా ప్రసంగించడం కులాలు జాతుల మధ్య మత పరమైన భాషాపరమైన ఉద్రేకాలను సృష్టించేలా ఏ పార్టీ అభ్యర్థులు ప్రవర్తించకూడదు
-ప్రత్యర్థి పార్టీ విధానాలు కార్యకలాపాలపై మాత్రమే విమర్శలు పరిమితం కావాలి వ్యక్తిగత జీవితం పై విమర్శలు మానుకోవాలి అనవసర ఆరోపణలు వక్రీకరణలపై విమర్శలు చేయకుండా ఉండాలి
– ఓట్లను పొందడానికి కులం మతపరమైన భావాలపరంగా అభ్యర్థనలు చేయకూడదు ప్రచారం కోసం ఏ మతం ప్రార్ధనా మందిరాలను మరే ఇతర ఆరాధన ప్రదేశాలను వేదికగా ఉపయోగించరాదు. అలా చేస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది
-ఓటర్లను ప్రలోభ పెట్టడం బహుమతులు ఇవ్వడం బెదిరించడం అసలు ఓటర్లకు బదులుగా వేరే వ్యక్తులను ఓటర్లుగా చూపించడం తప్పు. పోలింగ్ స్టేషన్ కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు ఏర్పాటుకు అవకాశం లేదు
– శాంతియుత గృహ జీవనం ప్రతి వ్యక్తి హక్కు వ్యక్తుల ఇంటి ముందు వ్యతిరేక ప్రదర్శనలు ప్రికెటింగ్లకు దిగడం లక్ష్మణ రేఖ దాటడమే అవుతుంది. పార్టీ జెండాలు పాతడం బ్యానర్లు కట్టడం నోటీసులు అతికించడం నినాదాలు రాయడం ఇతరాత్ర పనులకు స్థలం భవన యజమాని అనుమతి తీసుకోవాలి
– ఇతర పార్టీలు నిర్వహించే ఊరేగింపులు సమావేశాలను భగ్నం చేయడం అడ్డంకులు సృష్టించడం భౌతిక దాడులకు దిగడం లాంటి చర్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధం ఒక రాజకీయ పార్టీ నిర్వహించే సమావేశాలను మరో రాజకీయ పక్షానికి చెందిన కార్యకర్తలు సానుభూతిపరులు భగ్నం చేయడం ఓ పుల్లంగన కిందకే వస్తుంది పార్టీ పోస్టర్లను మరో పార్టీ తొలగించడం నేరమే ఉల్లంఘన గుర్తిస్తే 1950 లేదా 18005992969 టోల్ ఫ్రీ లేదా సి విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు

Spread the love