సీసీ రోడ్డు పనులు, పైపులైన్ పనులు ప్రారంభం

– మునిగలవీడు గ్రామ ఎంపీటీసీ నల్లని శోభ పాపారావు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునగలవీడు గ్రామంలో 15 ఫైనాన్స్ నిధుల నుండి సీసీ రోడ్డు పనులు మరియు మంచినీటి సౌకర్యం కోసం పైపులైన్ పనులను ప్రారంభించినట్లు గ్రామ ఎంపీటీసీ నల్లని శోభా పాపారావు తెలిపారు. శనివారం గ్రామస్తులతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని మూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు.  ప్రజలు ఈ ఎండాకాలంలో తాగునీరు దొరకగా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలతో ఈ పైపులైను నిర్వహిస్తున్నామని అన్నారు. మండల పరిషత్ నిధుల నుండి ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love