
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల క్యాంపు కార్యాలయంలో మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా సోమవారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మంత్రి వర్యులు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి ,మాజీ మేయర్ ఆకుల సుజాత బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్ష -కార్యదర్శులు సిర్ప రాజు – ఎనుగందుల మురళి, మరియు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.