సెల్ ఫోన్ అందజేత

నవతెలంగాణ- మోర్తాడ్: మండలం వడ్డీ యార్డ్  గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్, ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న సెల్ ఫోన్ను కనుక్కొని బాధితుడికి అందజేసినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందివ్వడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. గత నెల రోజుల క్రితం పోయిన సెల్ ఫోన్ రెండు రోజుల క్రితం గుర్తించి బాధ్యతలకు అందజేశామని తెలిపారు.
Spread the love