– ‘స్వచ్ఛతా హీ సేవా’ క్యాంపెయిన్
హైదరాబాద్ : భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘స్వచ్ఛతా హీ సేవా(ఎస్‌హెచ్‌ఎస్)’ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహించింది. కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్‌లో గల జోనల్ ఆఫీస్ పరిసర ప్రాంతం వద్ద ఎస్‌హెచ్‌ఎస్‌ను జరిపింది. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ ధారాసింగ్ నాయయక్, డిప్యూటీ జోనల్ హెడ్ సతీశ్ ఎన్ తాల్రేజ, హైదరాబాద్ రీజినల్ హెడ్ వివేక్ కుమార్ శ్రీవాస్తవ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సి.హెచ్ సత్యవాణి, జోనల్, రీజినల్ ఆఫీసు ఎగ్జిక్యుటీవ్‌లు పాల్గొన్నారు.