భువనగిరి నూతన ఎంపీడీవో గా సిహెచ్ శ్రీనివాస్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆయనకు భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, భువనగిరి ఎంపీఓ అనురాధ దేవి లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. గతంలో ఇక్కడ పనిచేసిన నరేందర్ రెడ్డి బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో పిఆర్ ఎ ఈ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.