రుణాలు అందుకోవడంలో సవాళ్లు

– 47 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తల వెల్లడి
న్యూఢిల్లీ : తమ కుటుంబమే అతిపెద్ద ప్రేరణ అని 78 శాతం మహిళ పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్టు టైడ్‌ అధ్యయనంలో తేలింది. భారత్‌ ఉమెన్‌ యాస్పిరేషన్‌ ఇండెక్స్‌ నివేదిక పేరుతో 18-55 ఏండ్ల వయస్సు గల 1200 మంది యాజమానులను సర్వే చేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లోని 80 శాతం మంది మహిళలు వ్యాపారానికి డిజిటల్‌ అక్షరాస్యత తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. రుణాలను అందుకోవడంలో 47 శాతం మంది సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. మహిళ పారిశ్రామికవేత్తలకు మద్దతును ఇవ్వడానికి తాము టైడ్‌ ఉమెన్‌ ఇన్‌ బిజినెస్‌ ఎంసెంబుల్‌ (టీడబ్ల్యూఐబీఈ)ని ఏర్పాటు చేశామని టైడ్‌ గ్లోబల్‌ సీఈఓ ఆలివర్‌ ప్రిల్‌ తెలిపారు. 2027 నాటికి ఏడు లక్షల మంది మహిళ చిన్న వ్యాపార యాజమానులకు మద్దతును ఇవ్వాలని నిర్దేశించుకున్నామన్నారు.

Spread the love