బెంగళూరు : టొయోటా కొత్తగా కార్ కేర్ బ్రాండ్ ‘టి గ్లోస్’ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ క్రింద వాహనం రూపాన్ని లోపల, వెలుపల మెరుగుపరచడానికి క్యూరేటెడ్ సేవలను అందిస్తుందని తెలిపింది. దేశంలోని వినియోగదారులలో అధిక నాణ్యత, విశ్వసనీయమైన కార్ డిటైలింగ్ సేవలకు వేగంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మే ఒక్కటో తేది నుంచి దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. కస్టమర్‌లు తమ కారుకు ఇంటీరియర్ ఎన్‌రిచ్‌మెంట్, ఎక్స్‌టీరియర్ బ్యూటిఫికేషన్‌సమగ్ర సేవలను పొందవచ్చని తెలిపింది.