బెంగళూరు : దేశీయ టెక్స్‌లైట్ కంపెనీ వెల్స్పన్ లివింగ్ 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 16 శాతం వృద్థితో రూ.146 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.125 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.2,153.90 కోట్లుగా ఉన్న అమ్మకాలు.. గడిచిన క్యూ4లో 19.56 శాతం పెరిగి రూ.2,575 కోట్లకు చేరాయి. 2023-24లో కంపెనీ నికర లాభాలు 242.55 శాతం పెరిగి రూ.681 కోట్లుగా.. అమ్మకాలు 19.59 శాతం పెరిగి రూ.9,679 కోట్లుగా నమోదయ్యాయి.