న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఇందుకోసం తాజాగా సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించిందని సమాచారం. ఇందుకోసం కాన్ఫిడెన్షియల్ మార్గాన్ని స్విగ్గీ ఎంచుకోవడం ద్వారా ఆ సంస్థ ఐపీఓకు సంబంధించిన వివరాలేవీ బయటికి రావు. దీనికి సెబీ అనుమతిస్తే 18 నెలల్లో ఎప్పుడైనా ఐపిఒకు రావడానికి వీలుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.10,400 కోట్ల వరకు సమీకరించాలని స్విగ్గీ భావిస్తోందని సమాచారం.