అనాథలకు చల్లూరు యూత్ సభ్యుల చేయూత

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల సమ్మయ్యతో పాటు అతడి భార్య మృతి చెందడంతో వారి కుమారుడు రాజుకుమార్, రమ్యలు అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ తరఫున రూ.10500 సేకరించి ఆ చిన్నారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెండ్స్ యూత్ సభ్యులకు రాజుకుమార్, రమ్యలు ధన్యవాదాలు తెలిపారు.

 

Spread the love