చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ – నూతనకల్
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో సంక్షేమపాలన కొనసాగాలన్నా, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు గత ఎన్నికలలో ఐక్యతతో చేసిన విధంగా రానున్న ఎంపీ ఎన్నికలలో ప్రతి కార్యకర్త సైనికులు వలె పనిచేసి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
Spread the love