Tuesday, May 5, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ చైనా

చాంపియన్‌ చైనా

- Advertisement -

ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపు థామస్‌ కప్‌ 2026
హార్సెన్స్‌ (డెన్మార్క్‌) : ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ చాంపియన్‌గా బ్యాడ్మింటన్‌ పవర్‌హౌస్‌ చైనా నిలిచింది. పసిడి పోరులో ఫ్రాన్స్‌పై 3-1తో మెరుపు విజయం సాధించిన చైనా రికార్డు 13వ సారి థామస్‌ కప్‌ విజేతగా నిలిచింది. సింగిల్స్‌లో షి యుకి 21-16, 16-21, 21-17తో గెలుపొంది చైనాకు శుభారంభం అందించాడు. అలెక్స్‌ లేనియర్‌ (ఫ్రాన్స్‌) 21-13, 21-10తో లి షి ఫెంగ్‌పై గెలుపొంది లెక్క సమం చేశాడు. కానీ తర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ 22-20, 20-22, 21-19తో.. హీ జి టింగ్‌, ఎన్‌ యు జోడీ 21-13, 21-16తో విజయాలు సాధించారు. దీంతో మరో మ్యాచ్‌ ఉండగానే చైనా 3-1తో గెలుపొందింది. థామస్‌ కప్‌ను సొంతం చేసుకుంది. ఫ్రాన్స్‌ సిల్వర్‌ మెడల్‌ దక్కించుకోగా.. భారత్‌, డెన్మార్క్‌లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. 2022 థామస్‌ కప్‌ విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి సెమీఫైనల్లో నిరాశపరిచింది. ఫ్రాన్స్‌ చేతిలో ఓటమితో కాంస్య పతకానికి పరిమితమైంది. ఆయుష్‌ శెట్టి, లక్ష్యసేన్‌, హెచ్‌.ఎస్‌ ప్రణరు, కిదాంబి శ్రీకాంత్‌ సహా సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలతో కూడిన భారత జట్టు థామస్‌ కప్‌లో ఆకట్టుకుంది. ఉబర్‌ కప్‌ ఫైనల్లో 3-1తో చైనాపై గెలుపొందిన దక్షిణ కొరియా టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇండోనేషియా, జపాన్‌లు కాంస్య పతకాలు దక్కించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -