చార్లీ చాప్లిన్‌ కుమార్తె కన్నుమూత..

కాలిఫోర్నియా: ప్రపంచ దిగ్గజ హాస్యనటుడు, నవ్వుల రేడు చార్లీచాప్లిన్‌ కుమార్తె, నటి జోసెఫిన్‌ చాప్లిన్‌ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల 13న పారిస్‌లో ఆమె మతి చెందారు. 28 మార్చి 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జోసెఫిన్‌ జన్మించారు. చార్లీ చాప్లిన్‌-ఊనా ఓ నీల్‌ దంపతుల 8 మంది సంతానంలో ఆమె మూడో వారు. 1952లో తన తండ్రి సినిమా ‘లైమ్‌లైట్‌’తో చిన్న వయసులోనే తెరంగేట్రం చేశారు. 1972లో అవార్డు విన్నింగ్‌ సినిమా ‘పీర్‌ పావలో పాసోలిని’తోపాటు మరెన్నో సినిమాల్లో దిగ్గజ నటులతో కలిసి నటించారు.

Spread the love