తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌, వాగర్‌ కమాండర్లను కలిసిన పుతిన్‌

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తీవ్రతరం చేయటం కోసం ప్రణాళికలను రచించటానికి విల్నియస్‌ లో జరగనున్న నాటో శిఖరాగ్ర సభకు ముందు, జూన్‌ 29 నాడు అంటే తిరుగుబాటు విఫలమైన తరువాత కేవలం 5రోజుల తరువాత రష్యా అధ్యక్షుడు, పుతిన్‌ ఎవ్జెనీ ప్రిగోజిన్‌ ని కలవటం జరిగింది. ఈ వార్తను మొట్టమొదటిసారి శుక్రవారం ఫ్రెంచ్‌ వార్తాపత్రిక లిబరేషన్‌ ప్రచురించింది.
రష్యన్‌ సైనికాధికారులతో నెలల తర బడి తగవులాడిన మితవాది, నేరస్తుడిగా నిరూపించ బడినవాడు, శత కోటీశ్వరుడు అయిన ప్రిగోజిన్‌ జూన్‌23వ తేదీనాడు తిరుగుబాటు చేయటమే కాకుండా రష్యన్‌ సంపన్న ఒలిగార్క్‌ వర్గానికి, ప్రభుత్వ యంత్రాంగంలోని నాటో అనుకూల వర్గాల కు మద్దతు కోసం విజ్ఞప్తి చేశాడు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నడిపే మిలిటరీ కేంద్ర కార్యాలయాన్ని స్వా ధీనం చేసుకోవటమే కాకుండా రక్షణ మంత్రి, సెర్గీ షౌగును, చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ వాలెరీ జెరాసిమోవ్‌ లను పదవులనుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాడు.
తిరుగుబాటు విఫలం అయిన తరువాత కేవలం ఐదు రోజులకు పుతిన్‌ 35మందిని ఆహ్వానించాడు. వీరిలో వాగర్‌ సంస్థకు చెందిన కమాండర్లందరూ ఉన్నారు. రష్యా విదేశీ గూఢచార సంస్థ ప్రధానాధి కారి, సెర్గీ నరీష్కిన్‌, తిరుగుబాటును అణచటానికి సమీకరించిన నేషనల్‌ గార్డ్‌ హెడ్‌ అయిన విక్టర్‌ జోలొటోవ్‌ కూడా ఉన్నారు. సమావేశానికి సంబం ధించిన వివరాలను క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి, డిమిట్రీ పెష్కోవ్‌ ఇవ్వనప్పటికీ పుతిన్‌ కి, వాగర్‌ కమాండర్లకు మధ్యన ఒక ఒప్పందం కుదిరిందనే స్పష్టమైన సూచన ఉంది.
తిరుగుబాటు తరువాత బైలోరష్యా ప్రెసిడెంట్‌ అలెగ్జాండర్‌ లుకషెంకో పుతిన్‌ కు, ప్రిగోజిన్‌ కు మధ్య రాజీ కుదిర్చాడు. ఆ రాజీ ప్రకారం ప్రిగోజిన్‌ కు, వాగర్‌ కమాండర్లందరకూ క్షమాబిక్ష పెట్టటమే కాకుండా వారిని బైలోరష్యాలో నివసించటానికి పంపటం జరుగుతుందన్నారు. అయితే వీరిని బైలో రష్యా పంపటం జరగలేదు. ఇప్పటికీ ప్రిగోజిన్‌ రష్యాలోనే ఉన్నాడు. వాగర్‌ కోసం సైనికులను చేర్చుకుంటూనే ఉన్నాడు. పది దేశాలకు పైగా విస్తరించిన వాగర్‌ సామ్రాజ్యాన్ని, వేలాదికోట్ల ప్రిగోజిన్‌ సంపదను నియంత్రించే ఉద్దేశం రష్యాకు ఉన్నదా అనేది సందేహాస్పదంగా ఉంది.
ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో ప్రమేయంలేదనే అబద్దాన్నిప్రచారం చేస్తూ తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌ ను ఉపేక్షించటమంటే రష్యా పాలక వర్గాలలోను, రాజ్య యంత్రాంగంలోను సంక్షోభం, చీలికలు ఉన్నాయని అర్థమౌతుంది. రష్యా పాలక వర్గాల చీలిక, సంక్షోభం మూలాలు సోవియట్‌ పతనంలోను, పెట్టుబడిదారీ వ్యవస్థ పున్ణస్థాపన లోను ఉన్నాయి. రష్యా అశేష వనరులను పెట్టుబడి దారీ వర్గ, ప్రభుత్వంలో అధికారంలోవున్న ఎలైట్‌ వర్గాలకు పుతిన్‌ అందుబాటులో ఉంచటాన్ని వ్యతి రేకిస్తున్న సోవియట్‌ పతనం తరువాత అనతి కాలంలో రకరకాల వక్రమార్గాల్లో అపార సంపదను పోగుచేసుకుని ఒలిగార్క్‌లుగా పిలువబడుతున్న సంపన్న వర్గంలోని ప్రధానమైన గ్రూపుకు ప్రిగోజిన్‌ ప్రాతినిధ్యంవహిస్తున్నాడు.
ఈ వర్గాల మధ్య సమతౌల్యాన్ని సాధించటానికి ,పరస్పరం వ్యతిరేకించుకునే ఒలిగార్క్‌ ముఠాల మధ్య సామరస్యాన్ని సాధించటానికి పుతిన్న చేస్తున్న ప్రయత్నం ఉక్రెయిన్‌ యుద్ధ స్వభావాన్ని నియంత్రి స్తుంది. రష్యా పెట్టుబడిదారీ రాజ్య న్యాయమైన భద్రతా సమస్యలను కొద్దిపాటు సైనిక వత్తిడితో అమె రికా నేత్రుత్వంలోని సామ్రాజ్యవాదులు గుర్తిస్తారనే నమ్మకంతో ఉక్రెయిన్‌ లో పుతిన్‌ తన ”ప్రత్యేక సైనిక చర్య”ను మొదలెట్టాడు. ఈ అంచనా తప్పని ఆచ రణలో రుజువౌతోంది. 11వ తేదీ నుంచి లిథ్యూ నియా రాజధాని విల్నియస్‌లో జరగుతున్న నాటో శిఖరాగ్ర సభ పెంచనున్న ఉక్రెయిన్‌ యుద్ధ తీవ్రతను పుతిన్‌ ఎలా ఎదుర్కోనున్నాడో వేచి చూడాలి.

Spread the love