ఉక్రెయిన్‌ నాటోలో చేరకుండా రష్యా అడ్డుకుంటుంది : మెద్వెదేవ్‌

మాస్కో: రష్యా భద్రతా సమస్యలను గౌరవిం చాలని నాటోను రష్యా డిమాండ్‌ చేస్తోందేతప్ప అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమిని నిలువరించే ఉద్దేశంగానీ, సామర్థ్యంగానీ రష్యాకు లేవని మాజీ రష్యా అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యన్‌ జాతీయ భద్రతా కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడుగావున్న డిమిట్రీ మెద్వెదేవ్‌ అన్నాడు. ఉక్రెయిన్‌ నాటోలో చేరటం విషయంలో రష్యా అంచనాలు తారుమారై ఫిన్లాండ్‌, స్వీడెన్‌ దేశాలు నాటోలో చేరటానికి సంసిద్దమవటానికి దారితీసిందనే వాదనను ఆదివారం ఆయన రాసిన వ్యాసంలో తిప్పికొట్టాడు. ఈ రెండు దేశాలు ఎప్పటినుంచో నాటో కూటమితో చెలిమిలో ఉన్నాయనేది అందరికీ తెలిసిందేనని మెద్వెదేవ్‌ రాశాడు.
గతంలో తమ దేశంలో అంతర్భాగంగా ఉండి, తమతో సరిహద్దు సమస్యలున్న దేశాలను నాటో కూటమిలోకి ఆహ్వానించవద్దని రష్యా కోరు తోంది. సాయుధ ఘర్షణలోవున్న దేశం నాటోలో చేరజాలదనే నియమం ఉన్నందున ఉక్రెయిన్‌ను నాటోలో చేరకుండా ఏవిధంగానైనా రష్యా నిరో ధిస్తుందని, ఎందుకంటే ఉక్రెయిన్‌తో రష్యాకు శాశ్వత సాయుధ సంఘర్షణ ఉంటుందని ఆయన హెచ్చరించాడు. యావత్‌ ప్రపంచంపైన పశ్చిమ దేశాలు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయనీ, ఈ ఆధిపత్యాన్ని నిలుపుకోవటం కోసం ఈ దేశాలు యుద్ధాలకు దిగుతున్నాయని మెద్వెదేవ్‌ తన వ్యాసంలో పేర్కొన్నాడు. ఈ సంఘర్షణలు దశాబ్దాలుగా కొనసాగు తాయని చెప్పటానికి ప్రవక్త కానక్కరలేదని ఆయన అన్నాడు.

Spread the love