సెమీకండక్టర్ల సాంకేతికత యుద్ధంలో చైనా ప్రతీకారం

బీజింగ్‌: సెమీకండక్టర్ల తయారీలో సాంకేతికతను అభివృద్ధి చేయ టంపై అమెరికా ప్రోత్సాహంతో తనపైన విధించిన ఆంక్షలను చైనా తట్టు కుని నిలబడటమే కా కుండా.. ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయా రీలో ఉపయోగించే అరుదైన మౌలిక ముడిసరుకుల ఎగుమతులపై తానే నియంత్రణ విధిం చింది. చైనీస్‌ వాణిజ్య మంత్రిత్వ శాఖ విధించిన ఎగుమతి నియంత్రణలు ఆగస్టు 1వ తేదీనుంచి అమలులోకి వస్తాయి. కంప్యూటర్‌ చిప్స్‌ తయారీ లోను, సోలార్‌ ప్యానల్స్‌, అధునాతన రాడార్లలో వాడే పరికరాలవంటి అనేక ఉత్పత్తుల తయారీలోను వాడే గ్యాల్లియం, జర్మేనియం అనే అరుదైన లోహాల ఎగుమతుల పై ఈ నియంత్రణలు ఉంటాయి. జాతీయ భద్రతకు సంబంధిం చిన సమస్యల కారణంగా ఈ లోహాలను, వీటితో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులను ఎగుమతి చెయ్యాలంటే ఎగుమతిదారులు ”ప్రత్యేక అనుమతి” తీసుకోవలసి ఉంటుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గ్యాల్లియం ఉత్పత్తిలో ప్రపంచంలో చైనాదే అగ్రస్థానం. అలాగే జర్మే నియంకు సంబంధించి చైనా ప్రధాన ఎగుమతిదారు. ఈ రెండు లోహాలను అత్యంత అవసరమైన ముడిసరుకులుగా యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది. అంటే ఐరోపా ఆర్థిక వ్యవస్థకు ఈ లోహాలు కీలకమైనవిగా యూరోపియన్‌ యూనియన్‌ భావిస్తున్నది. అమెరికా జియొలాజికల్‌ సర్వేని అనుసరించి 1987నుంచి అమెరికా గ్యాల్లియంను ఉత్పత్తి చేయలేదు. 2018-2021 మధ్యకాలంలో అమెరికా దిగుమతి చేసుకున్న గ్యాల్లియంలో 53శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీకి, కృత్రిమ మేధకు అవసరమైన సాంకేతికత ను చైనా అభివృద్ధి చేయకుండా అడ్డుకట్టవేయటానికి అమెరికా ప్రోద్బలంతో చిప్స్‌ తయారీకి ఉపయోగించే లితోగ్రఫీ మెషినరీని చైనాకు ఎగుమతి చేయకుండా డచ్‌ ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో చైనా ఈ లోహాల ఎగుమతులపైన నియంత్రణలను విధించింది. డచ్‌ ప్రభు త్వ చర్య గర్హనీయమైనదని, అమెరికా ”ప్రపంచాధిపత్యాన్ని” కొనసాగిం చటం కోసం ఇతర దేశాలపైన వత్తిడితెచ్చి ఇటువంటి పనులను చేయిస్తు న్నదని చైనా విమర్శించింది. ప్రపంచ సెమికండక్టర్‌ సరఫరా గొలుసులో స్థిరత్వం కొనసాగాలంటే ఎగుమతి నియంత్రణలు ఉండకూడదని చైనా హితవు పలుకుతోంది. రెండు ముడి లోహాల ఎగుమతులపై చైనా విధించిన నియంత్రణలు ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీకోసం అస్థిత్వంలోవున్న సరఫరా గొలుసులో స్థిరత్వంపైన హెచ్చరికగా భావించాలి. అమెరికా, దాని మిత్రదేశాలు చైనా పైన విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా చైనా అరుదైన రెండు లోహాల ఎగు మతులపై నియంత్రణలను విధించింది. అంతేకాదు అధునాతన ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీలోను, వాటి తయారీకి ఉపయోగించే లితోగ్రఫీ మెషినరీ తయారీ లోను ఈ మధ్యకాలంలో చైనా గణనీయమైన విజయాలను సాధించింది. దానితో చైనాపైన ఆంక్షలను విధించిన అమెరికాలోనే సెమి కండక్టర్‌ పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

Spread the love