బోధన్ పట్టణంలోని రాకాసి పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (JC)ని గురువారం పద్మా సింగ్ ( పి ఎల్ వి ) , రమణ PV ( పి ఎల్ వి ) , సునీత ( సి హెచ్ సి ), మరియు కళ్యాణి (న్యాయవాది), డి ఎల్ ఎస్ ఏ నిజామాబాద్ లతో కూడిన బృందం మధ్యాహ్న భోజన సమయంలో బోధన్‌లోని రాకాసి పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (JC)ని సందర్శించారు. పాఠశాల పర్యటనలో విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారాన్ని మరియు చక్కని విద్యని చెబుతున్నారా లేదా అని తనిఖీ చేశామన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆహారం నాణ్యతగా ఉందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని , విద్యార్థులతో కలిసి ఆహారాన్ని రుచి చూస్తూ, దాని నాణ్యత మరియు భద్రతను నిర్ధారించడం ద్వారా ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఆహార సేవను చురుకుగా పర్యవేక్షిస్తున్నారని, తరగతి గదులు చక్కగా నిర్వహించబడుతున్నాయని, బోధనా సిబ్బంది సరిపడా విధులు నిర్వర్తిస్తున్నారని , మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయని , విద్యార్థులకు సరిపడా క్రీడా స్థలం ఉందని, విద్యార్థుల వినోద కార్యక్రమాలకు అనుకూలంగా ఉందని తెలిపారు.