వీఆర్ఎలను క్రమబద్దీకరించడం పట్ల హర్షం

– సీఎం కేజీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
నవతెలంగాణ -మంగపేట
వీఆర్ఏలను ప్రభుత్వంలో క్రమబద్దీకరిస్తు సీఎం కేసీఆర్ సోమవారం జీవో విడుదల చేయడం పట్ల మండల వీఆర్ఏల సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పది, ఇంటర్, డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివిన వీఆర్ఏలకు వారసులకు వారి వారి అర్హతలను బట్టి 58 వేల 850 రూపాయల నుండి 72 వేల 850 రూపాయల నెలసరి జీతం ఇచ్చేలాగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ కుటుంబాలను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాయని అన్నారు. రాష్ట్రంలోని 20 వేల 555 మంది వీఆర్ఏలను క్రమబద్దీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాగ బాబు, నాగార్జున, నర్సింహారావు, నర్సింహామూర్తి, రాము, కౌసల్య, సమ్మక్క, గౌషియా, రాణి, వెంకటనర్సమ్మ, శిరీష. పగిడమ్మ, రాంబాబు, సంపత్, కార్తీక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Spread the love