నియోజకవర్గ అభివృద్ధి కోసం చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలుపించాలి..

నవతెలంగాణ-తొగుట
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలుపించాలని తల్లి విజయమ్మ అన్నారు.ఆదివారం రాత్రి మండలం లోని వెంకట్రా వు పేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతం లో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అన్నారు. ముత్యంరెడ్డి ఆశయ సాధన కోసం తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారని దుబ్బాక మరింత అభివృద్ధి సాధించాలంటే శ్రీని వాస్ రెడ్డి ని బారి మెజారిటీతో గెలుపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే దుబ్బాక ను అభివృద్ధి కోసం ముత్యంరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని యాగాంధీ కి కానుకగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలుపించాలన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం శ్రీని వాస్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలి పారు. ఆమె వెంట శ్రీనివాస్ రెడ్డి సోదరి, కాంగ్రెస్ నాయకులు రేపాక తిరుపతి, బెజనమైన అనిల్, రాములు, మిద్దె సంతోష్, గడ్డమీది బాలయ్య తది తరులు ఉన్నారు.
Spread the love