చత్రపతి శివాజీ మహారాజ్ దేశానికి అందించిన సేవలు మరువలేనివి

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి ఈప్పరుగా గ్రామంలో గురువారం నాడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ గంగారం, అరుణ తార, గ్రామ సర్పంచ్ ప్రకాష్ గాయక్వాడ్ వివిధ పార్టీల ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు గ్రామస్తులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జుక్కల్ ఎమ్మెల్యే అనుమంతు సిండే మాజీ ఎమ్మెల్యే గంగారం మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ మహారాజ్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని కొని ఆడారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులకు ప్రతి ఒక్కరికి గ్రామం తరపున శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సభ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగింది చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ పెద్దలు గ్రామస్తులు కలిసి గ్రామంలో ఊరూకే అన్నదానం చేపట్టడం గ్రామంలో పండుగ వాతావరణంగా కనిపించింది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ముమ్మర ఏర్పాట్లు చేశారు గ్రామ పెద్దల ఆహ్వానానికి ఎంపీ ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నాయకులు హాజరు కావడం వారందరికీ గ్రామం తరపున గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Spread the love