
నవతెలంగాణ – గోవిందరావుపేట
బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతాయనీ ఎంపీడీవో జవహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగము ములుగు ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధక అధికారులైన పంచాయతీ సెక్రటరీలకు వివాహాల నమోదు చట్టం & బాల్య వివాహాల నిరోధక చట్టం పైన సెన్సిటైజేషన్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యం పీ డి ఓ జవహర్ రెడ్డి మరియు జిల్లా బాలల పరిరక్షణ అధికారి జే.ఓంకార్ లు హాజరై మాట్లాడారు. గ్రామ పరిధిలో సి ఎం పి ఓ లుగా పంచాయతీ కార్యదర్శులు ఉంటారు కాబట్టి, వివాహాలు జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే స్పందించి, బాల్య వివాహము ఆపే విధంగా చర్య తీసుకోవాలని తెలియజేశారు, అదేవిధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం & 1098 నుండి సిబ్బందికి సమాచారం అందించినట్లైతే తగిన సపోర్టు ఉంటుందని, బాల్య వివాహము ఆపు చేసిన వారిని సి డబ్ల్యూ సి ముందు హాజరు పరిచి పిల్లలకు తగ్గ న్యాయం చేసే విధంగా చూడాలని తెలియజేశారు.
అదే విధంగా జీవో ఎంఎస్ నెంబర్ 19 ప్రకారం అధికారులు ఎవరైనా ఉల్లంఘన చేసినట్లయితే వారికి శిక్ష తప్పనిసరి ఉంటుందని తెలియజేశారు. ఇప్పటివరకు ములుగు జిల్లాలో 150 పెళ్లిళ్ల వరకు ఆపడం జరిగిందని, పంచాయతీ సెక్రటరీస్ అందరూ సహకారంతోనే ఇది సాధ్యమైంది అందుకోసమని గ్రామాలలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ఉన్నందుకు గాను ఆ కమిటీలను అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లడం వల్ల గ్రామాలలో జరిగే పిల్లల సమస్యకు తొందరగా పరిష్కారం మార్గం దొరుకుతుంది అందుకోసమని గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఎంపీడీవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిదిలో ఎలాంటి బాలల సమస్యలు వచ్చినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది అందుకోసమని ఫీల్ లెవెల్ లో పనిచేసే సెక్రటరీస్ తమరికి సహాయ సపోర్టు చేస్తారని గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేసే విధంగా చూద్దామని ప్రతినెల మీటింగ్ నిర్వహించుకుందామని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ఎం పి ఓ సాజిదా బేగం, ఏ పీ ఓ ప్రసన్న, డిసిపియు విభాగం బండారి జ్యోతి మరియు అన్ని గ్రామాల పంచాయతీ సెక్రెటరీలు ఫీల్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.