పి.చంద్రశేఖర్ ఆజాద్ కు బాల సాహిత్య పురస్కారం

నవతెలంగాణ హైదరాబాద్: ప్రముఖ రచయిత పి. చంద్రశేఖర ఆజాద్ కు కేంద్ర సాహిత్య అకాడమి 2024వ సంవత్సరానికి ప్రకటించింది. ఆయన రచించిన ‘మాయాలోకం’ బాల కథా సంపుటికి అకాడమి పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు బాల సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలుగా నిలిచిన ‘అందమైన పూల తోట’, ‘మా హృదయం’లతో పాటు ‘జమీందారు ‘కోట’, ‘దేవతా ఓ దేవతా’, ‘దారి తప్పిన పిల్లవాడు’, ‘పిల్లల పుస్తకం’, ‘ఆట’ నవలలు రాశారు. వందలాది పిల్లల కథలు రాశారు. ‘పిల్లల ప్రపంచం’, ‘చుక్ చుక్ రైలు’, ‘వాయిస్ ఆఫ్ చిన్ని’ లాంటి శీర్షికలు నిర్వహించారు. పాండవులు, బోన్సాయ్, అడవి పూలు, తమసోమా (పిల్లల టెలిఫిల్మ్), భారతి (బాలల సినిమా)లకు కథ-స్క్రీన్ ప్లే -సంభాషణలు అందించారు. ఇవన్నీ స్వర్ణ నందులు (4), వెండి నంది (1) సాధించాయి. పిల్లల కోసం అనేక రేడియో నాటికలు రాశారు. తానా – మంచి పుస్తకం నిర్బావహించిన బాలసాహిత్య పోటీ, 2021లో బహుమతి పొందిన నవల ‘మాయాలోకం’.

Spread the love