ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తొందరగా ధాన్యాన్ని  తరలించాలి: చింతల రాజు 

నవతెలంగాణ – నెల్లికుదురు 
రైతులు పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినటువంటి ధాన్యాన్ని తొందరగా కాంటాలు నిర్వహించి ధాన్యం కొనుగోలు కేంద్రం లేకుండా పూర్తి చేయాలని తాసిల్దార్ కోడి చింతల రాజు అన్నారు. బుధవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి నిర్వాహకులకు తగు సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడి ధాన్యం తడిసే అవకాశాలు ఉన్నాయని దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దానం లేకుండా నిర్వాహకులు కాంటాల్ నిర్వహించి కొనుగోలు చేసి తొందరగా కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని తెలిపారు. రైతులను ఇబ్బందులు పెట్టవద్దని అన్నారు తొందరగా కాంటాలను నిర్వహించి లారీలలో మిల్లర్లకు పంపించే కార్యక్రమాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ పుల్లయ్య వివో మంజుల కొనుగోలు కేంద్రం కమిటీ అధ్యక్షురాలు బొల్లం అనిత కార్యదర్శి గాండ్ల విజయ ఇన్చార్జి బండి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love