మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలోని 4 బూత్ లలో రీపోలింగ్ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అంబటి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అటు, చంద్రగిరిలో స్క్రూటినీ రీ షెడ్యూల్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా నిరాశ తప్పలేదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

Spread the love