రూ. 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: సీఐటీయూ

– ఆశ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలి

నవతెలంగాణ – కంటేశ్వర్
మరణించిన ఆశా వర్కర్లకు రూ.50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆశ వర్కర్ల అందరికీ పర్మనెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జమ్మిశెట్టి శంకర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మార్చ్ 29 శుక్రవారం నాడు ప్రెస్ నోట్ పత్రిక ప్రకటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జమ్మిశెట్టి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎడపల్లి మండల కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్ లో ఆశ వర్కర్స్ పని నిమిత్తం వర్క్ చేస్తూ బయటకు వెళ్తుండగా బైక్ తో ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి వెంటనే అలికి అబ్బవ్వ అనే ఆశ వర్కర్ మరణించడం జరిగింది. వారికి సంబంధించి ఉప వైద్య జిల్లా అధికారి విద్య కి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మరణించిన ఆశ వారి కొరకు రూ.50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ఆశ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలి. ఆశా వర్కర్లకు కనీసం నెలకు రూ.18,000 ఇవ్వాలి. మరణించిన కార్మికురాలు కుటుంబానికి ఒక ఆశ వర్కర్ ఉద్యోగం ఇవ్వాలి. వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 20000 రూపాయలు ఇవ్వాలి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు జరగకుండా ప్రభుత్వము పరిష్కారం చేయాలి అలాగే మోపాల్ మండలానికి సంబంధించిన మరొక్క ఆశ వర్కర్ విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల నిమిత్తం డ్యూటీ చేస్తూ అనారోగ్యం గురై నిన్నటి రోజు అనగా మార్చి 28వ తారీకు శుక్రవారం నాడు మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాయుటం నిర్వహిఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రా జిల్లా నాయకురాలు గైని రాజమణి ఈ కార్యక్రమానికి మద్దతుగా ఇచ్చి వారి ఉద్దేశించి మాట్లాడటం జరిగింది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు ఏషాల గంగాధర్. ఆశా వర్కర్లకు ఎల్లవేళలా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మద్దతిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జంగం గంగాధర్ సీఐటీయూ జిల్లా నాయకులు కటారి రాములు. ఆశ వర్కర్ల వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు అనసూయ రాజేశ్వరి పద్మ సుజాత దివ్య సుధమ్మ రేఖ తదితరులు పాల్గొన్నారు.
Spread the love