కార్మికుల సమస్యల పట్ల సీఐటీయూ రాజీలేని పోరాటం

– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
– కాటేదాన్‌లో ఘనంగా సీఐటీయూ
– 54వ ఆవిర్భావ దినోత్సవం భారీ బైక్‌ ర్యాలీ
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
కార్మికుల సమస్యల పట్ల నిత్యం సీఐటీయూ ఆధ్వ ర్యంలో పోరాటాలు జరుగుతూనే ఉంటాయని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అన్నారు. గురు వారం కాటేదాన్‌లో జరిగిన సీఐటీయూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కాటేదాన్‌ డంపింగ్‌ యార్డ్‌లో సీఐటీయూ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని చెత్త డంపింగ్‌ యార్డ్‌ వద్ద నుంచి ప్రారంభించిన భారీ బైక్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల ఎక్కువగా ఉంటారని, ఇక్కడి కంపెనీ యజమానులు వారిచేత వ్యక్తి చాకిరి చేయించుకుని కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు యాజమాన్యాలకు అమ్ముడు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగి న అనేక సంఘటనల్లో సీఐటీయూ కార్మికుల పక్షాన పోరా డి వారికి న్యాయం జరిగే వరకూ కార్మికులకు అండగా ఉందని గుర్తు చేశారు. ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు గతంలో ప్రమాదవశాత్తు చేతిలో కాళ్లు పోగొట్టుకుంటే యాజమాన్యంతో చర్చించి వారికి నష్టపరిహారం కూడా ఇప్పించిందన్నారు. కార్మికులందరూ ఐక్యమత్యంతో ఉంటే అన్ని సమస్యలు దశలవా రీగా పరిష్కారం అవుతాయని అ న్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్న సీఐటీయూ దృష్టికి తీసుకొని వస్తే తక్షణం సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల కష్టాలు వర్ణణతీతంగా మారాయని అన్నారు. కాటేదాన్‌ సీఐటీయూ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్‌ రావు, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రకుమార్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కురుమయ్య సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గండిపేట మండల కన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్‌, కాటేదాన్‌ క్లస్టర్‌ కోశాధికారి భాస్కర్‌, డంపింగ్‌ యార్డ్‌ రాష్ట్ర కమిటీ నాయకులు మోహన్‌ బాలకృష్ణ, ఫిల్టర్‌ డంపింగ్‌ యార్డ్‌ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజాసంఘాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love