అవి ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టిస్తాయి
ప్రభుత్వానికి రబ్బరు స్టాంప్‌లుగా అనుమతి సంస్థలు :
మాజీ సివిల్ సర్వెంట్లు
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు 71 మంది లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఇటీవల పర్యావరణ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని మాజీ సివిల్ సర్వెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 71 మంది మాజీ సివిల్ సర్వెంట్లు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్రాజెక్టులను సవాలు చేయడానికి ప్రజలు వెనుకంజ వేసే ప్రమాదముందని పేర్కొన్నారు. ‘కాన్‌స్టిట్యూషన్ కండక్ట్ గ్రూప్’ పేరిట ఈ లేఖ విడుదలైంది. గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అనుమతులను సమర్థించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో ఈ లేఖ రావడం గమనార్హం.ఈ విచారణ సందర్భంగానే సీజేఐ సూర్యకాంత్ పర్యావరణ కార్యకర్తలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిపైనే సివిల్ సర్వెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘‘భారత్‌లో ఒక ప్రాజెక్టునైనా పర్యావరణ కార్యకర్తలు స్వాగతించారని చూపించండి.
దేశం అభివృద్ధి చెందుతోందనీ, ఈ ప్రాజెక్టును మేము ఆహ్వానిస్తున్నామని వారు ఎప్పుడైనా చెప్పారా?’’ అని సీజేఐ వ్యాఖ్యానించినట్టు నివేదికలు వచ్చాయి. దీంతో సీజేఐ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. పర్యావరణవేత్తలు, మాజీ సివిల్ సర్వెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ అత్యున్నత న్యాయస్థానాధిపతి నుంచి రావడం ఆందోళనకరమైన పక్షపాత భావనను సూచిస్తోం దని మాజీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తుది లిఖితపూర్వక ఉత్తర్వులో లేకపోయినా.. విస్తృతంగా ప్రచారంలోకి వచ్చా యని వివరించారు.“ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో భయాన్ని పెంచి, విభేద స్వరాలను మూయిస్తాయి. పర్యావరణ నాశనం, ప్రజల ఆరోగ్యం, స్థానిక సమాజాలపై ప్రభావం వంటి అంశాలను ప్రశ్నించ కుండా నిరుత్సాహపరుస్తాయి. ఇది ప్రజాస్వామ్యా నికి వ్యతిరేక ధోరణులకు దారితీస్తుంది” అని లేఖలో మాజీ సివిల్ సర్వెంట్లు పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో
ప్రజా ఉద్యమాలది కీలక పాత్ర భారత్‌లో పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య బాధ్యతను బలోపేతం చేయడంలో ప్రజా ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయని వారు పేర్కొన్నారు. కేరళలోని సైలెంట్ వ్యాలీ ఉద్యమం, ఉత్తరాఖండ్‌లో చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, కర్నాటకలో అప్పికో ఉద్యమాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు. “పర్యావరణ చైతన్యంతో ఉన్న పౌరులు, ప్రభావిత సమాజాలకు సుప్రీంకోర్టు ఎన్నో దశాబ్దాలుగా చివరి ఆశ్రయంగా ఉంది. అలాంటి సమయంలో పరిరక్షణ కోసం పోరాడుతున్న పౌరులపై సీజేఐ తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి” అని లేఖలో వారు పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకం చేసినవారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్ర పర్యావరణ మాజీ కార్యదర్శి మీనా గుప్తా, మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్షమందర్, విదేశాంగ మాజీ కార్యదర్శి కె రఘునాథ్, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రైబీరోలు ఉన్నారు.
‘రబ్బర్ స్టాంప్‌లుగా పర్యావరణ సంస్థలు’
ప్రభుత్వం నియమించిన పర్యావరణ అంచనా సంస్థలపై సుప్రీంకోర్టు ఉంచుతున్న నమ్మకాన్ని కూడా మాజీ అధికారులు ప్రశ్నించారు. పిపావావ్ కేసు విచారణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు, పర్యావరణ అంచనా సంస్థలపై సుప్రీంకోర్టు విశ్వాసం వ్యక్తం చేసిందని, అలాంటి సంస్థలు ఆమోదించిన ప్రాజెక్టులను సాధారణంగా అడ్డుకోకూడదని కోర్టు సూచించినట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే భారత పర్యావరణ పరిపాలన వ్యవస్థ తీవ్ర లోపాలతో నిండి ఉందని మాజీ అధికారులు ఆరోపించారు. ఆరావళి కొండల కేసులో సుప్రీంకోర్టు మొదట నిపుణుల కమిటీ నిర్వచనాన్ని అంగీకరించి, తర్వాత తిరిగి పరిశీలించాల్సి వచ్చిన విషయాన్ని వారు ఉదాహరణగా చూపించారు. అలాగే గతేడాది ఆగస్టులో సరిస్కా టైగర్ రిజర్వ్ సరిహద్దుల మార్పుపై రాజస్తాన్ ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని సుప్రీంకోర్టే విమర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధ సంస్థలు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు “రబ్బర్ స్టాంప్‌లు” గా మారుతున్నాయని కూడా ఆరోపించారు.
సీజేపీ అధి<<<కారిక వెబ్‌సైట్
యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫేమస్ సోషల్ మీడియా పేజీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎక్స్ అకౌంట్ నిలిపివేత, ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధికారిక వెబ్‌సైట్ ను తొలగించారు. ఈ ఘటనపై స్పందించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ సోషల్ మీడియా ఖాతాల వరుస తొలగింపులు, హ్యాకింగ్ ఘటనల నేపథ్యంలో తమ సోషల్ మీడియా ఖాతాల్లో దేనికీ యాక్సెస్ లేకుండా పోయిందని, తమ డిజిటల్ సంస్థపై ఉక్కు పాదం మోపుతూ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ చేయబడిందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఇండియాలో సీజేపీ ఎక్స్ ఖాతాను నిలిపివేశారని, దీంతో కొత్త ఖాతాను తెరిచిన రెండ్రోజుల్లోనే దాన్ని కూడా నిలిపివేశారని విమర్శించారు.
విద్యా రంగంలోని వ్యవస్థాగత వైఫల్యాలు, నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ సీజేపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పేపర్ లీక్ విషయంలో విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి విషయంలోనూ చర్యలు తీసుకోవాలి. కానీ ఈ నూతన భారతదేశంలో జవాబుదారీతనం కోరినందుకు సీజేపీపై చర్య తీసుకుంటున్నారు’ అని ఆయన విమర్శించారు. ‘సీజేపీపై ఉక్కు చర్య. ఇన్‌స్టా పేజీ హ్యాక్ చేయబడింది. నా వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేయబడింది. ఎక్స్ ఖాతాను నిలిపివేశారు. బ్యాకప్ ఖాతానూ తొలగించారు. సీజేపీ వెబ్‌సైట్‌ను కూడా తొలగించారు. ఇకపై అందుబాటులో లేదు. దయచేసి గమనించండి. ప్రస్తుతం మా ప్లాట్ ఫారమ్‌లోని దేనికీ మాకు యాక్సెస్ లేదు. దీని తరువాత చేసే ఏ పోస్ట్‌ను కూడా సీజేపీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటనగా పరిగణించరాదు’ అని సీజేపీ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు.’ప్రభుత్వం కాక్రోచ్‌లకు ఎందుకు భయపడుతోంది? ఇది నియంతృత్వ ధోరణి’ అంటూ అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో వ్యాఖ్యానిం చారు.
అలాగే ‘కాక్రోచ్‌లు ఎప్పుడూ చావవు’ అంటూ కొత్త ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్నామని తెలిపారు. తమను అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు. ఇంతటి అణచివేత ఉన్నప్పటికీ ఉద్యమం మరింత పెద్దదవుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఒక సోషల్ మీడియా ఉద్యమంగా ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పరీక్షల లీకులు, యువత సమస్యలపై సెటైరికల్ పోస్టులతో ఈ ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదిం చింది.ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మంది ఫాలోవర్లు రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఆ పార్టీ ఎక్స్ అకౌంట్‌ను ఇండియాలో నిలిపివేయడం, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా విమర్శిస్తుండగా, మరికొందరు ఇది కేవలం వైరల్ రాజకీయ వ్యంగ్య ప్రచారమేనని అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలో సిజెపి ఎక్స్ హ్యాండిల్‌ను నిలిపివేయడంపై డిజిటల్ హక్కుల సంఘం ‘ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్’ విమర్శించింది. ఈ చర్యను ప్రభుత్వ అధికార దుర్వినియోగంగా ఆ సంఘం పేర్కొంది. తొలగింపు



