రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

– టీఎస్ ఎం ఎస్ పాఠశాల సీఎస్ వేణుబాబు

– గౌట్ హైస్కూల్ పాఠశాల సీఎస్ ఎం రవి
నవతెలంగాణ –  నెల్లికుదురు
మండల కేంద్రంలోని గౌట్ హైస్కూల్లో నూట తొంబై మంది, టి ఎస్ ఎం ఎస్ పాఠశాలలో 212 మంది పరీక్షలు రాయబోతున్నారని ఆ పాఠశాల సీ ఎస్ లు, ఎం రవి వేణుబాబు ఆదివారం తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మండల కేంద్రంలోని గౌట్ హైస్కూల్, టీఎస్ ఎం ఎస్ పాఠశాలలో మొత్తం 402 మంది విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు నేటి నుండి రాస్తున్నారని అన్నారు. పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు 9 గంటల వరకే ఆయా సెంటర్లలో ఉండాలని అన్నారు 9: గంటల30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని అన్నారు. వీరికి రూములలో పరీక్ష రాసేందుకు అన్ని వసతులను కల్పించామని తెలిపారు. విద్యార్థులు పరీక్ష రాసే ముందు ఒకటికి రెండుసార్లు ప్రశ్నపత్రాన్ని చదివి తప్పులు లేకుండా కొట్టివేతలు లేకుండా వచ్చిన వాటిని రాసుకోవాలని తెలిపారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ పాల్పడిన సహించేది లేదని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఏ పార్టీల నాయకులు కానీ స్వచ్ఛంద సంస్థలు గాని పార్టీ గుర్తులు ఉన్నటువంటి వస్తువులను ఎవరైనా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ పెన్సిల్ రబ్బరు మీద గుర్టులు ఉన్నటువంటి పంపిణీ చేసినట్లయితే గుర్తులు ఉన్నటువంటి వస్తువులను పరీక్ష కేంద్రాలలో అనుమతించబడదని తెలిపారు. పరీక్ష సమయానికి అటే ముందు హాజరుకావాలని తెలిపారు.
Spread the love