గిరిజన ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు..

charset=InvalidCharsetId

– ఒకే గదిలో 3 తరగతులు నిర్వహణ
నవతెలంగాణ అచ్చంపేట: లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి రెండు1, 2, 3  తరగతులను ఒక గదిలో 4, 5, 6  తరగతులను మరొక గదిలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు.45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు గిరిజన విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులను గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు ప్రవారికి కూడా లేకపోవడంతో విద్యార్థులకు భద్రత కరువైంది. ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని గ్రామపంచాయతీ నిర్మాణం కోసం తీసుకుంటున్నారు. విద్యార్థులకు తరగతి గదులు లేక అవస్థలు పడుతుంటే ఉన్న స్థలాన్ని గ్రామపంచాయతీకి కేటాయించడం సరైంది కాదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాల స్థలంపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పాఠశాల హెడ్మాస్టర్ తిరుపతయ్య తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని 6 వ. తరగతి విద్యార్థులు మధు ,విజయ్, సిద్దు ,పవన్ , ఐదో తరగతి విద్యార్థులు కార్తీక్ , లోకేష్, అంజి, ప్రసాద్ ,ఉమాదేవి, భరత్ లు కోరుతున్నారు.

Spread the love