స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం 20 వ డివిజన్లో రోడ్లను శుభ్రపరచడం, తడి పొడి చెత్తను వేరు చేసి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, వార్డు ఆఫీసర్, మెప్మా సిబ్బంది, ఎస్ ఎస్ జి మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొని స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో గల డంపింగ్ యార్డ్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో చెత్తను ఎక్కడికక్కడ శుభ్రం చేస్తూ తడి చెత్త పొడి చెత్తగా విడదీసే విధంగా విడదీసి వేరు చేసే పద్ధతిని క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు.