‘కల్యాణ లక్ష్మి’తో పేదలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్‌

– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ – కూకట్‌ పల్లి
రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే తన క్యాంప్‌ కార్యాలయంలో 137 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా నిరు పేద ఆడబిడ్డ పెండ్లికి 1 లక్ష 116 రూపాయలు అందించి సీఎం కేసీఆర్‌ వారికి పెద్దన్నగా మారారని తెలిపారు. దేశం లో మరెక్కడా ఈ పథకం లేదన్నారు. అనేక ప్రాజెక్టుల ద్వా రా బీడువారిన భూములను పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత కేసీఆర్‌ చెల్లుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్‌ గౌడ్‌, పగుడాల శిరీష బాబురావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన యువకులు
ఈనాటి యువతే రేపటి భవిష్యత్తు అనిఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. కూకట్‌ పల్లి శేషాద్రి నగర్‌ కమ్యూనిటీ హాల్లో బుధవారం చైతన్య యాదవ్‌, సంతోష్‌, మహేష్‌ ఆధ్వర్యంలో జరిగిన యూత్‌ ఇంట్రాక్షన్‌ కార్యక్ర మంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నేడు రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలే యువత భవిష్యత్తుకి మార్గదర్శకాలు కూడా అవుతాయని అనడంలో సందేహం లేదన్నారు. ఇందుకు నిదర్శనం.. మంత్రి కేటీఆర్‌ ఎన్నోవేల పరిశ్రమలను నేడు ముందుచూపుతో హైదరాబాద్‌ మహానగరానికి తీసుకువచ్చి భవిష్యత్తులో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా చర్యలు తీసుకోవడం గొప్ప పరిణామం అన్నారు .అలాగే భవిష్యత్తును దష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలేశ్వరం వంటి నీటి ప్రాజెక్టులు నిర్మించి ఒకప్పుడు బీడు భూములుగా ఉండే నేలలను పంట భూములుగా మార్చారని చెప్పారు. ఫణి ముదిరాజ్‌, శ్రీధర్‌, విశ్వనాథరెడ్డి ,లడ్డు, 130 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

Spread the love