సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల దేవుడు

నవతెలంగాణ-వీణవంక
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల దేవుడని, ఆయన సారథ్యంలో నిర్వహించే ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు, అభివృద్ధి దేశానికి దిక్సూచి లా ఉన్నాయని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి, మహారాష్ట్ర సర్పంచులు చల్లురు గ్రామంలోని దళిత బంధు యూనిట్ లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి, మహారాష్ట్ర చెందిన సర్పంచులు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 20వేల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున అందజేసి వారి కుటుంబాల అభివృద్ధికి దోహద పడుతున్నారన్నారు. వెంకటేశ్వర స్వామి వలె అందరికీ అండగా ఉంటూ చల్లగా చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ వలె దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిగా రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ మున్సిపల్ రేణుక తిరుపతిరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్, ఎంపీటీసీ సవిత మల్లయ్య, ఎంపీఓ ప్రభాకర్, ఆర్ఐ రవీందర్, దళిత బంధు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love