గోదావరిలో నీటి లభ్యతపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలు, పరిస్థితులపై ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పరిస్థితులపై చర్చించేందుకు.. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొననున్నారు.

Spread the love