జస్టిస్‌ చంద్రచూడ్‌ను కలిసిన సీఎం రేవంత్‌

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన నిమిత్తం హైదరాబాద్‌ విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి డీ.వై.చంద్రచూడ్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారు. గురువారం హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌ నుమాలో చంద్రచూడ్‌ తో భేటీ అయ్యారు. మరోవైపు మెదక్‌ ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపికైన నీలం మధు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌ లోని సీఎం నివాసంలో ఆయన రేవంత్‌ను కలిశారు. ఫ్రాన్స్‌ రాయబారి థియరీ మాథౌ, ముంబై లీలావతి హాస్పిటల్‌ ట్రస్టీ ప్రశాంత్‌ మెహతా బృందం ముఖ్యమంత్రితో వేర్వేరుగా భేటీ అయ్యారు.

Spread the love