అంగరంగ వైభవంగా సీఎంఆర్‌ ప్రారంభం

– సందడి చేసిన ప్రముఖ సినీనటి రాశి ఖన్నా
– సరసమైన ధరలతో వస్త్రాలు అందించాలి :ఎమ్మెల్యే
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని హనుమాన్‌పేట సాగర్‌రోడ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. సినీనటి రాశి కన్నా వస్త్ర దుకాణాన్ని సందర్శించి సందడి చేసింది. ప్రముఖ మిమిక్రీ యాంకర్‌ శివారెడ్డి రాజకీయ ప్రముఖ నాయకులు, సినీ యాక్టర్‌ల గొంతుతో మిమిక్రీ చేశారు. గాయకులు మానస పాటలతో ఉత్తేజపరిచారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే అందించాలి :ఎమ్మెల్యే
నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే అందించాలని ఎమ్మెల్యే నల్లగోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణం ఎంతో అభివద్ధి చెందుతుందని అనేక రంగాలలో పెద్ద పెద్ద మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలు ఈ మాల్స్‌లో దొరుకుతాయని, అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు.
శుభకార్యాలకు వేదిక సీఎంఆర్‌ మాల్‌
సినీనటి రాశి ఖన్నా
అన్ని రకాల శుభకార్యాలకు వేదికగా సీిఎంఆర్‌ మాల్‌ గెలిచిందని సీనీనటి రాశిఖన్నా అన్నారు. వస్త్ర ప్రపంచంలో అతిపెద్ద షాపింగ్‌ మాల్‌గా సీఎంఆర్‌ నిలిచిందని, శుభకార్యాలకు అవసరమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు అమ్ముతున్నారని అన్ని వర్గాల ప్రజలకు ఈ సీఎంఆర్‌ మాల్‌ ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు ఆదరించి వ్యాపార అభివద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌ వైస్‌ చైర్మన్‌ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్‌ చిలుకూరి రమాదేవి శ్యామ్‌, షాపింగ్‌ మాల్‌ చైర్మన్‌ మావూరి వెంకటరమణ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మావూరి మోహన్‌ బాలాజీ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు శంకర్‌ నాయక్‌, పట్టణాధ్యక్షులు గాయం ఉపేందర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ మేనేజర్‌ ఫణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love