రాజధానిలో బొద్దింకల వీరవిహారం
అన్నిదారులూ మూసినా
అన్ని ద్వారాల దగ్గర కాపేసినా
ఆగని న్యాయపోరాటం
అధర్మంపై అమానుషంపై
అలుపెరుగని అసహన ప్రకటన
బయట టేర్ వాయువులు
భాష్పవాయువులు నిర్భందించలేని
నిరోధించలేని యువశక్తి నడుం బిగించింది
దుర్మార్గపు రాజనీతి రాజ్యమేలుతోంది
లోన అధర్మేంద్రుడు హాయిగా
ఏసీ గదుల్లో రక్షణవలయంలో
సేదతీరుతున్న దృశ్యాలు
చుట్టూ దుష్టచతుష్టయాలు కూడా
సిగ్గుతో తలవంచుకునేంతటి
చిన్నపిల్లల మరణాలు బయట
వాళ్లంతా వైద్యులై వెలగాల్సినవారు
అవినీతి మంటల్లో మాడిమసైనారు
చట్టసభల్లో కండ్లున్న ధృతరాష్ట్రులు
చెవులున్నా వినపడని భీష్ములు
ధర్మాలు ప్రవచిస్తున్న కాలం
బిర్నాం అడవులు నడిచొచ్చి
మేక్బెత్ ను చుట్టుముట్టినట్టు
బొద్దింకల గుంపులు కోటచూట్టూ చేరి
ఈ పాలనకు చరమాంకపు గీతం
రచించి గానం చేస్తున్నారు వినండి
ఇకనైనా కండ్లు తెరచి మనసుతో కనండి
కాలగర్భంలో కలసిపోకముందే
చిన్నారులకు న్యాయవైద్యం అందించండి
జంధ్యాల రఘుబాబు,
9849753298
ధర్మం వైపు బొద్దింకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



