రాంపూర్ గ్రామంలో 11న కొబ్బరికాయలు వేలంపాట

నవతెలంగాణ- తలకొండపల్లి
మండల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెలసిన పలు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఈ నెల 11 వ తేదీన బహిరంగ కొబ్బరికాయలు వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ స్నేహలత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఈనెల 23/12/2023 నుండి 1/1/2024 తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి,జాతర సమయంలో కొబ్బరికాయలు అమ్ముకోవడానికి కొబ్బరికాయలు వేలపాటలో పాల్గొనవలసిన వారు రూ,5000 వేల రూపాయలు డిపాజిట్ చేసి రాంపూర్ గ్రామపంచాయతీ దగ్గర ఉదయం 11:30 నిమిషాలకు నిర్వహించి వేలం పాటలో పాల్గొనవలసిందిగా ఆలయ ఈఓ స్నేహలత తెలిపారు.
Spread the love