కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలుకొబ్బరి నీటిలోని కాల్షియం ఎము కల్ని, పళ్ళను దఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి సహకరిస్తుంది. శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయిన ప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనా లతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి. మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడి యం వంటి పోషకాలు ఉన్న కొబ్బరి నీరు తాగ డం వల్ల గర్భవతులకు మలబద్దకం, జీర్ణకోశంలో సమస్యలు తలెత్తవు. పాలిచ్చే తల్లులు ఈ నీళ్లు తాగితే పాల ద్వారా వారి బిడ్డలకు ఈ పోషకాలు అందుతాయి. కొబ్బరి నీరు తల్లి పాలలో చేరి లారిక్‌ యాసిడ్‌ను పెంచుతుంది. దీనిలో యాంటీఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉంటాయి.

Spread the love