దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

నవతెలంగాణ-సుబేదారి
జిల్లాలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సంబంధితశాఖల అధికారులను జిల్లా కలేక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జూన్‌ 2 నుండి 21రోజుల పాటు నిర్వ హించే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలపై శాఖల వారిగా చేపట్టే కార్యక్రమాల పై విధివిధానాలు సిద్ధం చేయాలని అధి కారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు కమిటీని నియమించ నున్న ట్లు తెలిపారు. ఉత్సవాలనిర్వహణలో భాగంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో వైభవోపేతంగా ఉత్సవాలు ఉండాలని ఆ దిశగా అన్ని శాఖల ఆధ్వర్యంలో ముంద స్తు కార్యక్రమాలను రూపొందించుకోవాలని శాఖలవారిగా అమలుచేస్తున్న అభివృ ద్ధి సంక్షేమ పథకాలపై కూడా ఛాయా చిత్ర ప్రదర్శనలు ఉండాలని సూచించారు. పదేళ్లల్లో జిల్లాలో సాధించిన విజయాలు, అభివృద్ధిపై అన్ని శాఖలు పూర్తి సమాచా రం కలిగి ఉండాలన్నారు. ఈ ఉత్సవాల్లో అన్నిశాఖలు తాము సాధించిన విజయా లకు సంబంధించిన సమగ్ర సమాచారా న్ని రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, డీసీపీఎంఎ.బారి, డీఆర్‌వో వాసుచంద్ర, ఆర్‌డీవో రాము, డీఆర్‌డివో ఆకవరం శ్రీనివాస్‌కుమార్‌,డీపీవో జగదీ శ్వర్‌, సీపీవో సత్యనారాయణరెడ్డి, జెడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, ఏసీపీ కిరణ్‌కు మార్‌, డీఎఫ్‌వో వసంత, ఎస్‌సి కార్పొరేషన్‌ ఈడీ మాధవిలత, డీటీడబ్ల్యూవో ప్రేమకళా రెడ్డి, డీడబ్ల్యూవో మధురిమ, డీఏవో రవీందర్‌సింగ్‌, అగ్రికల్చర్‌ ఏడీఏ దామోదర్‌రెడ్డి, డీఈవో అబ్దుల్‌హై, డీఎంహెచ్‌వో సాంబశివరావు, జిల్లా టూరిజం అధికారి శివాజీ, ఇండిస్టీస్‌ జీఎం హరిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love