విత్తన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలి

– రైతు ధరంసోత్‌ చందులాల్‌ ఫిర్యాదు
నవతెలంగాణ-తొర్రూరు
తమ కంపెనీ విత్తనాలు వాడితే అధిక దిగుబడి వస్తుందని చెప్పి తీరా పంట వేసాక పూత, కాతలేక నష్టపోయిన మిరప రైతు సదరు విత్తన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ మేరకు బుధవారం డివిజన్‌ కేంద్రంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇంచార్జ్‌ వింజమూరి సుధాక ర్‌కు కురవి మండలం గాజ్య తండా పంచాయతీ పరి ధిలోని టేకుల తండాకు చెందిన బాధిత రైతు ధరం సోత్‌ చందూలాల్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా రు. ఈ సందర్భంగా బాధిత రైతు చందూలాల్‌ మా ట్లాడుతూ మిరప పంట సాగు చేసి ఆశించిన దిగుబ డి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశపడ్డాన ని, కానీ నకిలీ మిరప విత్తనాలు తనకు అంటగట్టడం తో పంట నష్టపోయి ఆర్థికంగా చితికిపోయానని తెలి పారు. శ్రీలక్ష్మి పెస్టిసైడ్స్‌, సీడ్స్‌ సంస్థకు చెందిన మిర ప విత్తనాలు కొనుగోలు చేసి కురవి మండలం టేకు ల తండా పరిధిలో మూడు ఎకరాల్లో మిరప పంట వేసానని, మిరప దిగుబడి బాగా రావాలని రూ.5 ల క్షల మేర పెట్టుబడి పెట్టానని తెలిపారు. శ్రీ లక్ష్మీ పె స్టిసైడ్స్‌ సీడ్స్‌ సంస్థ మాటలు నమ్మి మిరప పంట సాగు చేస్తే కాత, పూత రాలేదని, 1కిలో దిగుబడి కూ డా రాలేదని, దీంతో ఆర్థికంగా నష్టపోయానని పేర్కొ న్నారు. విత్తనకంపెనీ మోసంపై ఉద్యాన శాఖ అధికా రులకు ఫిర్యాదు చేయగా వారు పంటను పరిశీలించి నష్టంజరిగినట్లు రిపోర్టు అందించినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అంటగట్టిన కంపెనీపై చర్యలు తీసు కోవాలని, సాగు ఖర్చులు, పరిహారం కింద రూ. 25 లక్షలు అందించాలని రైతు కోరారు. మిరప విత్తన కంపెనీకి నోటీసులు పంపి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని డిసిఐసి ఇన్చార్జి సుధాకర్‌ రైతుకు హామీ ఇచ్చారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్పుడు రైతులు బిల్లులు తీసుకోవాలని, విత్తన ప్యాకెట్‌ కవర్లు భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నకిలీ వి త్తనాలు విక్రయించినా, ఉత్పత్తి చేసినా క్రిమినల్‌, పీడీ యాక్ట్‌ నమోదు చేసే వీలుందన్నారు. రైతులను మో సగిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని, నాసిరకం విత్తనాలు అంటగడితే వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుధాకర్‌ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో డిసిఐసి డైరెక్టర్‌ షేక్‌ జానీ పాల్గొన్నారు.

Spread the love