రైతులకు అండగా ఉంటాం

– ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి సత్యవతి
నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురు మండలం, శ్రీరామగిరి పీఏసీఎస్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆకస్మికంగా తని ఖీ నిర్వహించినట్లు తెలిపారు.బుధవారం సెంటర్‌ సందర్శించి రైతులుఎవరు అధై ర్య పడవద్దు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతుల ధైర్యం నింపా రు. ఈ సందర్భంగా మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొ నుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని సేకరించాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బందుకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తడిసిన ధా న్యాన్ని కూడా సేకరిస్తామని, రైతులు ఆదోళన చెందవద్దని రైతులకు మంత్రి సత్య వతి రాథోడ్‌ భరోసా కల్పించారు. ధాన్యాన్ని రోజువారీగా కాంటాలు నిర్వహించి కాంటాలు నిర్వహించిన వాటిని వెంటనే మిల్లర్లకు ఎగుమతి చేయాలని తెలిపారు. నిర్వాహకులు సక్రమంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు ఏర్పాటు చేసి వారు తీసుకొచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారిని ఇబ్బందులకు గురి చేయ వద్దని ఆదేశించారు. రైతుల ఇబ్బందులు గుర్తించి సెంటర్‌ ఇన్చార్జులు వెంట వెం టనే పనులు నిర్వహించాలన్నారు. ఇక్కడి రైతులకు ఏది అవసరం వచ్చినా డిసిఒ చూసుకోవాలని తెలిపారు. వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తొందరగా కాం టాలు నిర్వహించి లారీలో ఎగుమతి చేయించి మిల్లర్లవద్ద సమస్య లేకుండా చూ సుకోవాలని తెలిపారు. మీకు అండగా ఉంటానని నీకు ఏ ఆపద వచ్చినా నేను వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Spread the love