సాఫీగా మండల సర్వసభ్య సమావేశం

– హాజరుకాని అధికారుల పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : ఎంపీపీ
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండ ల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్‌ రావు అధ్యక్షతన బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా గత సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైన వాటిని తీర్మానించిన విషయాలపై చర్చించారు. అనంతరం బుధవా రం నిర్వహించే సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొని సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని 90శాతం పైగా విజ యవంతం చేసిన వైద్యాధికారి వంశీకృష్ణను మండల సభ పక్షాన ఆయనను అభి నందించారు. చిన్న నాగారం సర్పంచ్‌ గాయపూ జైపాల్‌ రెడ్డి నెల్లికుదురు నాగా రం మీదుగా కేసముద్రం వెళ్లే రహదారికి ప్రక్కన విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ అధికారులను కోరారు. నెల్లికుదురు విద్యుత్‌ శాఖ ఏఈ అధి కారి స్పందించి త్వరలోనే ఈ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామంలో నీటి ఇబ్బందులు ఉన్నాయని వైస్‌ ఎంపీపీ జిల్లా వెంకటేష్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నర్సులగూడెం గ్రామ ఎంపీటీసీ వేశాల కృష్ణ య్య గ్రామాలలో ఏ కార్యక్రమం జరిగిన మాకు గుర్తింపు ఇవ్వడం లేదని నిధులు కూడా మంజూరు లేవని మాకు కొన్ని నిధులు ఇప్పించి ప్రతీ ప్రోగ్రాంలో మమ్ముల ను పిలవాలని, ప్రభుత్వ పనులకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. సంబంధిత ఏఈ రాజశేఖర్‌ మాట్లాడుతూ త్వరలోనే బిల్లు విడుదల అవుతాయని తెలిపారు. రతిరామ్‌తండా గ్రామంలో అధికారులు కాంట్రాక్టు కుమ్ముక్కై పేద ప్రజలు ఇబ్బం దులకు గురి చేస్తున్నారని రతిరాంతండా గుగులోతు మదన్‌ ఐటిడిఏ ఏఈ నిల దీశారు. ఐటీడీఏ ఏఈ స్పందిస్తూ అలా జరగలేదు. ఎవరితోటి కుమ్మక్కై పనులు నిర్వహించట్లేదని నిక్కచ్చిగా చెప్పేశారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడు తూ రైతుల కోసం జిలుగులు అన్ని ఆగ్రోస్‌ సెంటర్‌, ఫర్టిలైజర్‌ షాపులో సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మండల సర్వ సభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ జల్ల వెంకటేష, ఎంపీడీ వో శేషాద్రి, డిప్యూటీ తహసిల్దార్‌ తరంగిణి, ఎంపీటీసీలు వెన్నాకుల వాణి, దూడే నల్లని శోభ మదన్లాల్‌, సర్పంచులు వీరవెల్లి యాదగిరి రెడ్డి, గాయపు జైపాల్‌ రెడ్డి, భీముడు, వెలిశాల లక్ష్మి, మండల కోఆప్షన్‌ సభ్యుడు రహిమాన్‌, వివిధ శాఖల అధి కారులు ఎంఈఓ రాము, స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, ఐసిడిఎస్‌ సూప ర్వైజర్‌ మల్లీశ్వరీ, పశు వైద్యాధికారి డాక్టర్‌ సోమ శ్రీను,పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ రాజశేఖర్‌, విద్యుత్తు శాఖ ఏఈలు భార్గవి, సంధ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love