Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అండర్ గ్రౌండ్ పనులపై కలెక్టర్ ఆగ్రహం..

అండర్ గ్రౌండ్ పనులపై కలెక్టర్ ఆగ్రహం..

- Advertisement -

– సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు ఆదేశం..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ పనుల నిర్వహణ తీరుపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘కె.ఎన్.ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న పనుల పురోగతిని ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు.పనుల జాప్యంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి

సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో యూజీడీ పనులు అత్యంత నిర్లక్ష్యపూర్వకంగా సాగుతున్నాయని మండిపడ్డారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైపులు, మ్యాన్‌హోల్‌ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వేసి, నెలల తరబడి వాటికి సిమెంట్ కాంక్రీట్ పనులు చేయకుండా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల సాధారణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతోందని గుర్తుచేశారు. పైపులైన్లు, మ్యాన్‌హోల్‌ల నిర్మాణం పూర్తయిన వెంటనే తవ్విన గోతులను పూడ్చకపోవడం ముమ్మాటికీ నిర్లక్ష్యమేనని తవ్వకాల సమయంలో దెబ్బతిన్న తాగునీటి పైపులైన్లు, ఇతర ప్రజా వినియోగ సదుపాయాలను సకాలంలో పునరుద్ధరించకపోవడం వల్ల ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

పనుల్లో వేగం పెంచడంతో పాటు ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. యూజీడీ పనులు చేపట్టిన అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి రోడ్డు వారీగా వివరాలు, టైం లైన్ తో యాక్షన్ ప్లాన్‌ను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ, కాంట్రాక్ట్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేసి, దెబ్బతిన్న మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, మున్సిపల్ అధికారులు కూడా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నల్గొండ ప్రజారోగ్య శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ కుమార్, ప్రజారోగ్య శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు అనిల్ కుమార్, రమాదేవి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -