Sunday, July 5, 2026
E-PAPER
Homeదర్వాజరా తల్లి రా!

రా తల్లి రా!

- Advertisement -

వాన వాన
ఎక్కడికి పోయావే తల్లి!
భూమికి బువ్వ పెట్టే దేవతలు
ఒడ్డు మీద చేప పిల్లల వలె
తల్లి డిల్లుతుండ్రు
పుట్టెడు దుఃఖంలో ఉన్నారే తల్లి!
కాలం మీద చినుకు
క్యాపిటల్ కాకముందే,
నేలంతా ఎడారి పరుచుకోకముందే
వచ్చి పోవే తల్లి!
అసలే మాది పాలమూరు
వలస పక్షుల కరువు కథల
కన్నీటి ధారల కల్పవల్లి!
అమ్ముడు వస్తువు అయినా రాజకీయ
కొయ్య గుర్రాల ప్రయోగశాలనే తల్లి!
పాలమూరు తలకు కిరిటాల దగదగా
మెరుపైనా, రాజ్యం భోజ్యం
రాబందుల భాగవత కథలే!
వాన వాన వచ్చి పోవే
అమ్ముడుపోతున్న చదువులకు
బడి పిల్లల బ్యాగు బరువు కావొద్దు తల్లి!
రా తల్లి రా!
భూమికి బువ్వ పెట్టే
దేవతల కోసం..!
జనజ్వాల, 9949163770

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -