మనుషుల్లో మానవత్వం మసకబారుతున్న వేళ,
స్వార్థం అనే విత్తనం హృదయాల్లో మొలిచి,
సంబంధాల చెట్టును నెమ్మదిగా ఎండగొడుతోంది.
కుచ్చితత్వపు గోడలు మనసుల మధ్య లేచి,
ఆప్యాయతల దారులను మూసివేస్తున్నాయి.
అసూయల అగ్ని కళ్లలో రాజుకుంటూ,
ఇతరుల ఆనందాలను బూడిద చేస్తోంది.
కుటుంబాల మధ్య ప్రేమ కరిగిపోతూ,
అనుమానాల మేఘాలు కమ్ముకుంటున్నాయి.
రాజకీయాల పేరుతో మనుషులు విడిపోతూ,
మనసుల మధ్య సరిహద్దులు గీసుకుంటున్నారు.
మాటల్లో మాధుర్యం తగ్గిపోతోంది,
చేతల్లో కఠినత్వం పెరిగిపోతోంది.
నిజం కన్నా నటనే విలువైపోగా,
న్యాయం కన్నా అన్యాయమే గెలుస్తోంది.
పక్కవాడి బాధను చూడని చూపులు,
తమ సుఖాలకే పరిమితమవుతున్నాయి.
ప్రేమ పంచాల్సిన చేతులు నేడు,
ద్వేషపు విత్తనాలు చల్లుతున్నాయి.
ఈ చీకటిని చీల్చే వెలుగు రావాలి,
మనసుల్లో మళ్లీ మానవత్వం పూయాలి.
స్వార్థం స్థానంలో సహకారం నిలవాలి,
అసూయ స్థానంలో అభినందన వెల్లివిరియాలి.
కుట్రల బదులు విశ్వాసం పెరగాలి,
కుచితత్వం బదులు విశాలత్వం నిండాలి.
కుటుంబాలు కలిసే కాలం రావాలి,
మనుషులు మనుషులుగా నిలిచే రోజు రావాలి.
మార్పు ఎక్కడో కాదు, మనలో మొదలవ్వాలి,
అదే కొత్త సమాజానికి తొలి ఉదయం కావాలి.
డా॥కొరుప్రోలు హరనాథ్,
97035 42598
మార్పు రావాలి
- Advertisement -
- Advertisement -

