
సీపీఐ(ఎం) మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు విద్యార్థి యువజన రంగంలో రాష్ట్ర బాధ్యతల్లో పనిచేసిన పివి శ్రీనివాస్ నిన్న గుండెపోటుతో మరణించటం జరిగింది. ఈ మేరకు ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి విద్యార్థి యువజన రంగాల్లో అనేక ఉద్యమాలలో పాల్గొని పట్టణ పేదల సంక్షేమ సంఘం రాష్ట్ర బాధ్యతలు నిర్వహించిన పీవీ శ్రీనివాస్ పట్టణాల్లో పేదల నివసించే కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలను ఇవ్వటంతో పాటు తాగునీరు మురికి కాలువను అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని నేటికీ అనేక కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధను పెట్టకపోవడంతో పేదల బతుకులు లో మార్పులు రావటం లేదని ఆయన అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో శ్రద్ధ చూపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు పీవీ శ్రీనివాస్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, ఎం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత నగర కమిటీ సభ్యులు డి కృష్ణ ,మహేష్ మరియు సాయి, భాస్కర్, హైమద్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.