
హుస్నాబాద్ వాస్తవ్యులు మున్సిపల్ మాజీ కమిషనర్ గుండోజు శంకరయ్య మృతి పట్ల హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న బుదవారం సంతాపం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ గ్రామపంచాయతీలో వివిధ హోదాల్లో ఉదోగ బాధ్యతలు నిర్వహించి, జనగామ రామగుండం మున్సిపల్ లో కమిషనర్ గా సేవలందించిన శంకరయ్య మృతి హుస్నాబాద్ వాసులకు తీరని లోటు అన్నారు. హుస్నాబాద్ అభివృద్ధిలో శంకరయ్య పాత్ర ఎంతగానో ఉందని భవిష్యత్ తరాల కోసం అభివృద్ధి ఎలా ఉండాలని అమలు చేసి చూపించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు.