సివిఆర్ కళాశాలలో సెమినార్ నిర్వహణ

నవతెలంగాణ- ఆర్మూర్  
చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్  ల్యాండ్  సందర్భంలో పట్టణంలోని స్థానిక సివిఆర్ జూనియర్ కళాశాల లో గురువారం  సెమినార్  నిర్వహించడం జరిగింది. చంద్రయన్-3 మిషన్ కోసం మాట్లాడం జరిగింది.  ఈ సందర్భంగా  డివిజన్  ఎస్ఎఫ్ఐ  కార్యదర్శి సిద్ధాల నాగరాజు గారు మాట్లాడుతూ.. గత నెల 14న శ్రీహరికోట నుంచి చంద్రయన్-3  నింగిలోకి  పంపించారు. సుమారు 40 రోజున పుట్టిందని చంద్రమండలపై దక్షిణ ధ్రువం పై నిన్న సాయంత్రం 6 గంటలకి   చంద్రయన్-3 ల్యాండ్ విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి  ఇస్రో శాస్త్రవేత్తలకి   ధన్యవాదాలు తెలియజేశారు   గతంలో సోవియట్ యూనియన్ రష్యా, చైనా, అమెరికా, లాంటి దేశాలు మూన్ మిషన్ లో సక్సెస్ సాధించాయి కానీ  చంద్రయన్ 3 దక్షిణ ధృవం పై భారత్ జయకేతనం తొలి దేశంగా రికార్డు సృష్టించింది అని అన్నారు. దేశ కీర్తిని రెపరెపలాడించి చంద్రయన్-3 జాబిల్లి పై అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డ్ అని చెప్పారు  శాస్త్రవేత్తలు తాజా ప్రయోగం విజయవంతం కావడంతో  జాబిల్లికి సంబంధించిన అక్కడి రసాయనిక విశ్లేషణాలు చేసి ఆ సమాచారాన్ని భూమికి పంపనుంది  అంతరిక్ష పరిశోధనలో భారత్ కు  ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరిగిందన్నారు    నేటి విద్యార్థిని విద్యార్థులు సైన్స్ మాత్రమే నమ్మాలని మూఢనమ్మకాలను నమ్మొద్దని   ప్రతి విద్యార్థిని విద్యార్థులు సైంటిఫిక్ విద్యను అభ్యసించి దేశ భవిష్యత్తు కోసం కృషి చేయాలని  కోరారు  పురుషాధిక్యతతో  అణిచివేయాలని చూస్తే చంద్రమండలం వరకు ఎగరగలమని నిరూపించిన భారత నారీమణుల కు మీకు జోహార్లు  అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  అధ్యక్షులు జవహర్ సింగ్ అరవింద్ అభి శ్రీను మహేష్ తదితరులు పాల్గొన్నారు..
Spread the love