– జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత
నవతెలంగాణ-సిరిసిల్ల
ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడానికి సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం ఆవరణలో గురువారం మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శక ప్రకారం గురువారం లీగల్ సర్వీస్ డే సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు న్యాయ సేవలు అందించడం కోసం ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు గతంలో చట్టాలపై ప్రజల్లో అవగాహన ఉండేది కాదని ఈ అవగాహన సదస్సులతో ప్రజలకు చట్టాలపై అవగాహన కలుగుతుందని అన్నారు జిల్లాలోనే రైతుల కోసం ముస్తాబాద్ కోనరావుపేట మండలాల్లో అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు అక్కడ పారా లీగల్ వాలంటీర్లను ఏర్పాటు చేశామని అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలోని ర్యాగింగ్ నిరోధక సంఘాలను ఏర్పరిచి ర్యాగింగ్ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు ర్యాగింగ్ మూలంగా బాధిత విద్యార్థులే కాక ఈ నేరానికి పాల్పడిన విద్యార్థులు భవిష్యత్తు అవకాశాలు ప్రమాదంలో పడతాయని ర్యాగింగ్ ఆకృత్యాలనుండి విద్యార్థి లోకాన్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని ఆమె అన్నారు ఉత్తర న్యాయానికి లోక్ అదాలత్ లను వినియోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు న్యాయం దృష్టిలో అందరూ సమానులేనని న్యాయానికి గొప్ప బీద అనే తేడా లేదని అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల మూలంగా మరే ఇతర బలహీనతల మూలంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకూడదు అని ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు లోక్ అదాలత్ లో ఆమోదయోగ్యమైన తీర్పు ద్వారా మీ కేసులలో తుది పరిష్కారం ఉండవచ్చని వ్యయ ప్రయాసలు లేని సత్వర న్యాయం పొందాలంటే లోక్ అదాలత్ వ్యవస్థను వినియోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు తక్కువ వ్యవధిలో ఖర్చు లేకుండా మీ కేసులను లోక్ అదాలతో పరిష్కరించుకొని మీరు చెల్లించిన కోర్టు ఫీజులను ఆపస్ పొందవచ్చని అన్నారు న్యాయబద్ధమైన అంతిమ తీర్పు పొందాలంటే లోకాదాలత్తులను వినియోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ జిల్లా లోక్ అదాలత్ సభ్యులు చింతొజు భాస్కర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోడి లక్ష్మణ్ కంటి వైద్య నిపుణులు మహేష్ యాదగిరి గౌడ్ న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు